Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరిక!

జికా వైరస్ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. జికా వైరస్ డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాపింపజేసే ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మహారాష్ట్రలో ఇద్దరు గర్భిణులు సహా ఏడుగురికి జికా వైరస్ సోకినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

New Update
Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరిక!

Zika Virus: జికా వైరస్ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.జికా వైరస్ డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాపింపజేసే ఏడిస్ దోమ (Aedes) ద్వారా వ్యాపిస్తుంది. మహారాష్ట్రలో (Maharashtra) ఇద్దరు గర్భిణులు సహా ఏడుగురికి జికా వైరస్ సోకినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో జికా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పూణేలో గర్భిణులు సహా ఏడుగురికి జికా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలుకు కేంద్రం స్పష్టం చేసింది. జ్వరం, చర్మంపై దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు 7 రోజులు కొనసాగితే, ప్రజలు వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది.

Also Read: పానీపూరీ తింటే క్యాన్సర్ ఖాయం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు