ఎంట్రీ-లెవల్ ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 64,543, 60వి/32ఎహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని 55కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల పరిధితో 7 గంటల నుంచి 8 గంటల ఛార్జింగ్ సమయంతో ఉపయోగిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మిడ్ వేరియంట్ ధర రూ. 67,073, 72వి/32ఎహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. 7 గంటల నుంచి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 కి.మీ పరిధిని అందిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ. 87,673, 60వి/32ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. 80 కిలోమీటర్ల పరిధిని కేవలం 4 గంటల ఛార్జింగ్ సమయాన్ని అందిస్తుంది.
సమర్థవంతమైన పనితీరుతో ఒక్కో ఛార్జీకి దాదాపు 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. స్లో-స్పీడ్ ఇ-స్కూటర్ అయినందున గరిష్ట స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లకు పరిమితం చేసింది. మోడల్‌లు 80 కిలోల స్థూల బరువును కలిగి ఉంటాయి. అంతేకాదు.. ఇ స్కూటర్ల వినియోగానికిచాలా తేలికగా ఉంటాయి. అయితే, పేలోడ్ సామర్థ్యం 180 కిలోలు. విభిన్న బ్యాటరీ కాన్ఫిగరేషన్లు, పర్ఫార్మెన్స్ పరంగా కంపెనీ మొత్తం ఐదు వేరియంట్లను అందిస్తోంది.
జెలియో ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు యాంటీ-థెఫ్ట్ అలారం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, రియర్ డ్రమ్ బ్రేక్‌లు, ఫ్రంట్ సైడ్ అల్లాయ్ వీల్‌ను పొందుతాయి. మోడల్‌లు రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లను ఇరువైపులా ఉన్నాయి. ఈ స్కూటర్లపై డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉన్నాయి. మోడల్స్ బ్లాక్, వైట్, సీ గ్రీన్, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.