మంత్రికేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.ఆమె వ్యాఖ్యలు ఇలా సాగాయి.
''ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని నిసిగ్గుగా ఒప్పుకున్నాడు చిన్నదొర కేటీఆర్.
వైయస్ఆర్ గారు కేవలం గ్రావిటీ ద్వారా రూ.38వేల కోట్లతోనే ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయాలని భావిస్తే.. పెద్ద దొర కేసీఆర్ కమీషన్లు దోచుకోవడానికి రీడిజైనింగ్ పేరుతో రూ.1.25 లక్షల కోట్లకు పెంచాడు. సగం డబ్బు కాజేసి, వేల కోట్ల కరెంటు బిల్లులకు కారణమయ్యే ప్రాజెక్టును ముంగటేశాడు. అది కూడా మూణాళ్లకే మునిగింది.
- కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన పెద్ద దొర..కేవలం 1.50లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారు. కుద్దు హరీశ్ రావే అసెంబ్లీలో ఈ విషయం చెప్పాడు.
- 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేసిన అపరమేధావి కేసీఆర్. అందుకే అన్నాం బీఆర్ ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్రసమితి అని ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడమే వీళ్ల పని అని పేర్కొన్నారు.
- ఇప్పుడు నిస్సిగ్గుగా కాళేశ్వరంతో నీళ్లు రాలేదని, భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని చెబుతున్నాడు చిన్న దొర కేటీఆర్.
- మీది పాలన అనాలో,దిక్కుమాలిన పాలన అనాలో మీరే చెప్పండి