YSRTP: తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్టీపీ దూరం: షర్మిల సంచలన ప్రకటన

ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉంటుందని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

New Update
YSRTP: తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్టీపీ దూరం: షర్మిల సంచలన ప్రకటన

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ (CM KCR) పడిపోయే అంత ఛాన్స్ ఉందన్నారు షర్మిల. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను చీలిస్తే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చొద్దని ఎంతో మంది మేధావులు, మీడియా అధిపతులు తమను కోరారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని షర్మిల కోరారు. గెలుపు గొప్పది అని. . త్యాగం అంతకన్నా గొప్పదన్నారు.

కాంగ్రెస్ గెలవడం ద్వారా కేసీఆర్ నియంత పాలన అంతం అవుతుందన్న ఆలోచనతోనే ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. పాలేరు నుంచి గతంలో తాను పోటీ చేస్తానని ప్రకటించిన అంశంపై సైతం షర్మిల స్పందించారు. తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత కూడా తమకు అత్యంత సన్నిహితుడైన, గతంలో తనతో కలిసి నడిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను అక్కడి నుంచే నిలబడాలని నిర్ణయించుకున్నారన్నారు. దీంతో అక్కడి నుంచి పోటీని విరమించుకుంటున్నానన్నారు. ఈ విషయాన్ని పాలేరు ప్రజలు అర్థం చేసుకుంటారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు షర్మిల.

Advertisment
Advertisment
తాజా కథనాలు