YSRTP Merging in Congress: కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం ఫిక్స్! ప్రకటించనున్న రాహుల్ గాంధీ?

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశం దాదాపు ఖరారైంది. హస్తం పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విలీనంపై ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.

New Update
YSRTP Merging in Congress: కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం ఫిక్స్! ప్రకటించనున్న రాహుల్ గాంధీ?

YSRTP Merging in Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని (YSRTP) కాంగ్రెస్ పార్టీలో(Congress) విలీనం అంశం దాదాపు ఖరారైంది. హస్తం పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విలీనంపై ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా వైఎస్ షర్మిలకు కీలక పదవి ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారని సమాచారం అందుతోంది. కాగా, కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసే అంశంపై కాంగ్రెస్‌కు నేటి వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగిసింది. షర్మిల విధించిన డెడ్‌లైన్ ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని విలీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.

అయితే, షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. తమ వ్యతిరేకతను పార్టీ అధిష్టానం ముందే వెల్లడించారట. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనం ప్రక్రియ ఆలస్యమైంది. కర్నాటక ఎన్నికల తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్‌ను కలిశారు వైఎస్ షర్మిల. ఆ భేటీ సందర్భంగానే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారట. అలా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పలు ధఫాలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిశారు షర్మిల. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌లోనే ముఖ్య నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తుండటంతో అధిష్టానం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలోనే షర్మిల డెడ్‌లైన్ విధించడం, ఆ డెడ్‌లైన్ ముగియడం జరిగింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో చర్చోప చర్చలు జరిపిన పార్టీ హైకమాండ్.. చివరకు వారిని ఒప్పించింది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపో మాపో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read:

Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన

Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్

Advertisment
Advertisment
తాజా కథనాలు