Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల! పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన YSRTP లీడర్!

YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ గూటికి వెళ్తున్నట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. దళితుల కోసం దీక్ష చేపట్టిన షర్మిలను ఆర్టీవీ పలు ప్రశ్నలు వేసింది. దళితుల కోసం పోరాటం ఇకపై YSRTP నుంచి ఉంటుందా.. కాంగ్రెస్‌ నుంచి ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'తెలంగాణ ప్రజలు ముఖ్యం అని.. షర్మిలనో.. పార్టీనో ముఖ్యం కాదని బదులిచ్చారు షర్మిల'

New Update
Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల! పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన YSRTP లీడర్!

YSRTP leader sharmila clear on his political future: వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఊహాగానాల‌కు తెరపడినట్టే అనుకోవచ్చు! తాను కాంగ్రెస్‌ గూటికి వెళ్తున్నట్టు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు షర్మిల. లోటస్ పాండ్‌లో దళితుల కోసం దీక్ష చేసిన షర్మిల ఆర్టీవీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితుల కోసం వైఎస్‌ఆర్‌టీపీ నుంచి పోరాటం చేస్తారా.. కాంగ్రెస్‌ నుంచి చేస్తారా అని అడిగిన ప్రశ్నకు 'షర్మిల ముఖ్యం కాదని.. తెలంగాణ ప్రజలే ముఖ్యమని కామెంట్స్ చేశారు.

కేసీఆర్‌ మోసం చేశారు:
దళితుల కోసం దీక్ష చేసిన షర్మిల కేసీఆర్‌ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు.
షర్మిలా అసలు ఏం అన్నారంటే?

• 17 లక్షల మంది దళితులకు మూడేళ్లలో దళితబంధు ఇస్తానని హుజురాబాద్ ఎన్నికల సమయంలో మూడేళ్ల క్రితం కేసీఆర్ చెప్పారు.

• బడ్జెట్‌లో 40 వేల కోట్లయినా కేటాయిస్తానని చెప్పారు.

• తాను ఆలోచించినట్టుగా ఎవరు ఆలోచించరని కేసీఆర్ అప్పట్లో చెప్పుకున్నారు.

• ఎన్నికలు అవ్వగానే కేసీఆర్ మాట మార్చి సంవత్సరానికి రెండు లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తానన్నారు.

• ఆ లెక్కన చూసుకున్నా ఇప్పటివరకు కేసీఆర్ 6 లక్షల మందికి దళిత బంధు ఇచ్చి ఉండాలి.

• కానీ ఇప్పటివరకు కేసీఆర్ దళితబంధు ఇచ్చింది కేవలం 38 వేల కుటుంబాలకే.

• అది కూడా హుజూరాబాద్ ఎన్నికల జరుగుతున్న సమయంలో ఆ నియోజకవర్గానికే చెందిన 15,000 మందికి ఇచ్చారు

• ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు నిలబడుతున్న సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు ఇచ్చారు.

•  మరి మిగతా జిల్లాల్లో దళితులు లేరా..?

అసలేం జరిగిందంటే?
షర్మిలకు పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. నన్నెందుకు అడ్డుకుంటున్నారని.. తన చేయి ఎందుకు పట్టుకున్నారని పోలీసులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఏమన్నా కర్రలతో వెళుతున్నామా అని ప్రశ్నించారు. లోటస్‌ పాండ్‌లో షర్మిల ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. ముందుగా షర్మిలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే తన ఇంటికి వచ్చిన పోలీసులకు హారతి పట్టారు షర్మిల. మాపై దాడులు చేసినా మీరు పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు మమ్మల్ని కొట్టినా స్పందించరని.. మాపై బాంబులేసి మా ప్రాణాలు తీయండంటూ ఘాటు విమర్శలు చేశారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఆ తర్వాత షర్మిల దీక్ష విరమించారు.

Advertisment
తాజా కథనాలు