New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TDLP-Meeting-jpg.webp)
Andhra Pradesh Assembly Session: ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇప్పటికే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అయితే, ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ సభ్యులతో కలిసి వీరు సభలోకి వెళ్లనున్నారు. మేకపాటి చంద్రశేఖ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వ్యతిరేకిస్తూ టీడీపీకి సపోర్ట్ చేశారు. దాంతో వైసీపీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.
తాజా కథనాలు