/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kakani-Govardhan-reddy-.jpg)
ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి ఆశ్చర్యం కలగడంతో పాటు బాధ కలిగిందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించడంలో జగన్ ఎక్కడ రాజీపడలేదన్నారు. ఓటమిపై పార్టీలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. వైసీపీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవలోనే ఉంటామన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.