MLC Anantha Babu: ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కలకలం రేపింది. సోషల్ మీడియాలో న్యూడ్ వీడియో చక్కర్లు కొడుతోంది. న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతబాబుపై రంపగోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవీ విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ మహిళలను వేధింపులకు గురి చేయడం అతడి గారడీ అని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు మహిళలే టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. ఇకపై అలాంటి పప్పులు ఏజెన్సీలో ఉడకవు అని హెచ్చరించారు. ఇలాంటి వారిపై జగన్ చర్యలు తీసుకోవాలి సూచించారు.
న్యూడ్ వీడియోపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించారు. తనను ఎదుర్కోలేకే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని చెప్పారు. చిన్నారినికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇవ్వలేదని వీడియో మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు. న్యూడ్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనంతబాబు తెలిపారు.