Rachamallu: కూతురికి దగ్గరుండి కులాంతర వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

సాధారణంగా ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పిల్లల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే కులాంతర వివాహానికి మాత్రం మొగ్గు చూపించరు. టెక్నాలజీ కాలంలో కూడా పాత సంప్రదాయాలు పాటిస్తూ పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే వారిని చంపడమో, వెలివేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం.

New Update
Rachamallu: కూతురికి దగ్గరుండి కులాంతర వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

సాధారణంగా ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పిల్లల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే కులాంతర వివాహానికి మాత్రం మొగ్గు చూపించరు. టెక్నాలజీ కాలంలో కూడా పాత సంప్రదాయాలు పాటిస్తూ పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే వారిని చంపడమో, వెలివేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం తన కూతురికి కులాంతర వివాహాం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవి ఇష్టప్రకారం ప్రియుడితో పెళ్లి జరిపించారు. ముందుగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో దైవ శాస్త్ర ప్రకారం తాళి కట్టించి పెళ్లి చేశారు. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి వారి పెళ్లిని రిజిస్టర్ చేయించారు. అనంతరం వారికి వివాహ పత్రాన్ని కూడా అందించారు.

ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సంతోషకరమైన వార్త చెబుతున్నానని వెల్లడించారు. అత్యంత నిరాడంబరంగా తన పెద్ద కుమార్తెకు కులాంతర వివాహం జరిపించానని తెలిపారు. తన కూతురు చదువుకునే సమయంలో పవన్ అనే యువకుడిని ప్రేమించానని చెప్పిందని.. కానీ తాను కులం, డబ్బు, హోదా లాంటి అంశాలను పక్కనపెట్టి వారిద్దరికి వివాహం జరిపించానని వివరించారు. కులం కంటే గుణం గొప్పదన్నారు. పెళ్లికుమారుడు తండ్రి ఆర్టీసీలో ఒక్క చిన్న మెకానిక్‌.. అయినా కానీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెళ్లి చేశానన్నారు. డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇష్టమైన వ్యక్తికే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.ప్రజలందరూ వారిద్దరిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఓ ప్రజా ప్రతినిధిగా తన బిడ్డకే కులాంతర వివాహాన్ని నిరాండబరంగా ఆదర్శవంతంగా చేయడం చాలా సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఏ ఆడపిల్లకైనా తన మనసుకు నచ్చిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలని ప్రజలకు సూచించారు. చదువు ఉంది.. ఉద్యోగం ఉంది.. తన భార్యను ప్రేమించి సంతోషంగా చూసుకోగలడనే నమ్మకంతోనే అతనికి ఇచ్చి పెళ్లి చేశానన్నారు. తన నిర్ణయాన్ని గౌరవిస్తారని.. వారిద్దరికి మీ అందరి ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నానని రాచమల్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు