/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YSRCP-.jpg)
మాచర్ల హింసాత్మక ఘటనలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అల్లర్లపై ఈసీకి ప్రశ్నలు సంధిస్తూ సజ్జల ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలన్న సజ్జల ఈసీని డిమాండ్ చేశారు. పాల్వాయి ఘటన వీడియో అధికారిక వెబ్ కాస్టింగ్ నుంచి వస్తే.. ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు. వీడియో నిజమా కాదా..అని చూడకుండా.. ఈసీ ఎందుకు తొందరగా కదిలింది? అని అన్నారు.
A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue -
While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024
మాచర్లలో మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమైతే.. వాటిన్నింటిని పూర్తి స్థాయిలో ఎందుకు విడుదల చేయలేదన్నారు. ఆయా ఘటనల్లో దోషులను బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తుమ్మూరు కోటలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేసిన వీడియోను సజ్జల విడుదల చేశారు.