YSR Statue: వైఎస్ఆర్ విగ్రహానికి ఘోర అవమానం.. విగ్రహాన్ని ఏం చేశారో మీరే చూడండి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. వైఎస్ విగ్రహాన్ని తొలగించి చెట్ల పొదల్లో పడేశారు కొందరు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరిధిలోని ఏలేశ్వరం నగర పంచాయితీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

New Update
YSR Statue: వైఎస్ఆర్ విగ్రహానికి ఘోర అవమానం.. విగ్రహాన్ని ఏం చేశారో మీరే చూడండి..

YSR Death Anniversary: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. వైఎస్ విగ్రహాన్ని తొలగించి చెట్ల పొదల్లో పడేశారు కొందరు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరిధిలోని ఏలేశ్వరం నగర పంచాయితీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌లే ఈ ఘటనకు కారణం అని ఆరోపించారు వైసీపీ నేత అలమండ నాగేంద్ర. రోడ్లు వెడల్పు పేరుతో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించారని, పైగా మహానేత విగ్రహాన్నే తీసేశాం.. మీలాంటి పేదోళ్ల దుకాణాలు తొలగించడం మాకొక లెక్కా అని అన్నారని ఆరోపించారు.

అయితే, శనివారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించడానికి వైసీపీ కార్యకర్తలు విగ్రహం వద్దకు వెళ్లారు. కానీ, అప్పటికే ఈ ఘటన జరిగింది. చెట్ల పొదల మధ్య పడి ఉన్న విగ్రహాన్ని చూసి అవాక్కయ్యారు. కింద పడి ఉన్న విగ్రహానికి దండ వేయలేక, విగ్రహం పాదాల చెంత పూల దండ పెట్టి నివాళులర్పించారు వైఎస్‌ఆర్ అభిమానులు. వైఎస్ఆర్‌ బొమ్మ పెట్టుకుని, ఎమ్మెల్యే, చైర్మన్ పదవులు పొందినోళ్లు, నేడు ఆయన విగ్రహాన్నే ఇలా చేయడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు..

వైఎస్‌ఆర్ విగ్రహం తొలగింపు సందర్భంగా చేయి కూడా విరిగింది. ఆ విగ్రహం పక్కనే స్వామి వివేకానంద విగ్రహం కూడా ఉండటం సంచలనం క్రియేట్ చేస్తుంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైఎస్ఆర్‌ విగ్రహం, స్వామి వివేకానంద విగ్రహం కూడా ఉండటం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది. చెత్త కుప్పల్లో విగ్రహాలను చూసి వైఎస్ఆర్‌ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు, జడ్పిటిసిలు ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పనిచేసారని స్మరించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కోట్లాదిమంది ప్రజల మనసులను వైఎస్సార్ గెలుచుకున్నారని, అలాంటి మహానుభావుడు లేని లోటు తీరనిదన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి కాకాణి.

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ వర్ధంతి..

దివంగత నేత వైఎస్ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాటల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ముదుసూరి ప్రసాద రాజు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మరుపురాని, మరువలేని మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఒక డాక్టర్‌గా ఆగిపోయుంటే మ‌నిషి రుగ్మత‌ల‌ను మాత్రమే న‌యం చేసేవాడినని, రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌మాజంలోని పేద‌రికాన్ని, వెనుక‌బాటుత‌నాన్ని న‌యం చేస్తున్నాను అని చెప్పిన దివంగ‌త మ‌హానేత రాజ‌శేఖ‌ర‌రెడ్డి చెప్పిన మాటలను స్మరించుకున్నారు ఎమ్మెల్యే.

Also Read: ఎంఐఎం, బీఆర్‌ఎస్‌కి ఓట్లు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే.. ముస్లిం నేతలతో రేవంత్ కీలక వ్యాఖ్యలు..

Advertisment
తాజా కథనాలు