Revanth Reddy: వైఎస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి: రేవంత్ రెడ్డి వైఎస్సార్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్సార్ సంకల్పాన్ని నిజం చేయడానికి శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. By Nikhil 08 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 35 మంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడ్డ ప్రతీ నేత, కార్యకర్తకు పదవులు దక్కాలన్న వైఎస్సార్ స్ఫూర్తితోనే ఈ నియామకాలు చేపట్టామన్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వైఎస్సార్ సంకల్పించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి ఆ మహానాయకుడికి నివాళులు అర్పించారు. @revanth_anumula @Bhatti_Mallu #RevanthReddy #bhattivikramarka #tributes #YSRJayanthi #rtvnews #RTV pic.twitter.com/Hi4mWMuJa3 — RTV (@RTVnewsnetwork) July 8, 2024 ఆ స్ఫూర్తితో రాహుల్ ను ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళన చేయాలన్న ఆలోచన సైతం వైఎస్సార్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వివిధ కారాణాలతో పార్టీ వీడిన వారు మళ్లీ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. అనేక మంది పార్టీలోకి ఇప్పటికే తిరిగి వచ్చారన్నారు. తమ ప్రభుత్వం పని తీరుకు ఇది నిదర్శనమన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి