YSR Cheyutha : ఏపీ మహిళలకు శుభవార్త.. నేడే అకౌంట్లో రూ.18,750 !

వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయాన్ని ఇవాళ జగన్‌ సర్కార్‌ అందించనుంది. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది.

YSR Cheyutha : ఏపీ మహిళలకు శుభవార్త.. నేడే అకౌంట్లో రూ.18,750 !
New Update

YSR Cheyutha Scheme : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(AP CM YS Jagan) తన ఐదేళ్ల పాలనలో చివరి విడత వైఎస్‌ఆర్‌ చేయూత(YSR Cheyutha) ను ఇవాళ(మార్చి 7) విడుదల చేయనున్నారు. అనకాపల్లి మీటింగ్‌(Anakapalle Meeting) లో వైఎస్ఆర్ చేయూతను రిలీజ్ చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లా పిసినికాడ నుంచి ఆన్‌లైన్ విధానంలో 26,98,931 మంది మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం అందిస్తారు.

మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన ఈ లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి ఏడాదికి రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. అంటే ఈ నాలుగు విడతల్లో ఒక్కో మహిళా లబ్ధిదారునికి వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించింది. వైఎస్ఆర్ చేయూత కింద 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గలవారికి ఈ మనీ వేస్తారు.

ఏ పనికైనా ఉపయోగించుకోవచ్చు:
ఈ విడుత డబ్బులతో ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేయూత కింద ప్రభుత్వం అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.19,189.60 కోట్లకు చేరింది. అర్హులైన మహిళలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని ఏ పనికైనా ఉపయోగించుకునేలా వైఎస్ఆర్ చేయూత పూర్తి స్వేచ్ఛను కల్పిస్తోంది. ఇది ఏదైనా సూక్ష్మ, చిన్న-స్థాయి సంస్థ, జీవనోపాధి కార్యకలాపాలు లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించడానికి మహిళలకు స్వేచ్ఛను అనుమతించే పథకంగా జగన్‌ సర్కార్‌ చెప్పుకుంటోంది.

మహిళల కోసం ఎన్నో పథకాలు:
మరోవైపు కిరాణా దుకాణాలు(General Stores) ప్రారంభించడం, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం లాంటి జీవనోపాధి అవకాశాల ద్వారా ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు మద్దతును అందిస్తోంది. ITC, HUL, P&G, రిలయన్స్ లాంటి ప్రఖ్యాత మల్టీ నేషనల్‌ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా లబ్ధిదారులకు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయబడేలా చూస్తాయి. మార్కెటింగ్ టెక్నిక్స్‌లో మహిళలకు అవసరమైన శిక్షణ అందిస్తుంది. వారికి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు సహాయం అందజేస్తారు. వైఎస్ఆర్ చేయూత మహిళా మార్ట్‌(YSR Cheyutha Mahila Mart) ను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను అందజేసి వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు మార్కెటింగ్ టెక్నిక్స్‌లో శిక్షణ ఇస్తోంది. అలాంటి మహిళలకు ఇప్పటి వరకు స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రూ.6,266.82 కోట్ల రుణాలు అందించింది.

Also Read : విజయంతో అదరగొట్టిన సింధు-శ్రీకాంత్‌.. ఫస్ట్‌ రౌండ్‌ కే ప్రణయ్‌ ఔట్‌!

#andhra-pradesh #ap-cm-ys-jagan #ysr-cheyutha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe