YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్!

వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం.

New Update
YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్!

YS Viveka : కడప(Kadapa) ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) కి వైఎస్ వివేకానంద(YS Vivekananda) హత్య కేసులో ఊరట లభించింది. అవినాష్‌ రెడ్డి సాక్ష్యులను అవినాష్‌ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈ కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన అవినాష్‌ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి కి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు