Sharmila: ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్‌
New Update

YS Sharmila: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత విశాఖను రాజధానిగా ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండోసారి ముఖ్యమంత్రిగా కొత్త రాజధానిలోనే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. కర్నూల్ ను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. అయితే, ఈ కామెంట్స్ పై ప్రతిపక్ష్య నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: కొన్ని వందల కోట్లు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..ఇందులో నాకు ఆమెనే ఆదర్శం: కంగనా!

తాజాగా,  వైసీపీ సర్కార్ పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అని దుయ్యబట్టారు. ప్రస్తుతం షర్మిల చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ అని పేర్కొన్నారు. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అంటూ కామెంట్స్ చేశారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ అని.. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో ..కొత్త నాటకాలు కాదా ? అని నిలదీశారు.

#ys-jagan #ys-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe