YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి వైఎస్ విజయమ్మ దగ్గర దీవెనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో షర్మిల ఓ పోస్ట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read: టీడీపీ, జనసేన కూటమిలో కుంపట్లు.. టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ..!
మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నామన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో ప్రజల ఆశీస్సులు తనపై ఉంటాయని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.