YS Sharmila: ఏపీ సీఎం చంద్రబాబుపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని ట్వీట్టర్ లో మండిపడ్డారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్.. రెవెన్యూశాఖ కీలక సంస్కరణలు..!
"రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా ? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు ? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు ?" అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు..రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేశారు.