Sharmila: ఇడుపులపాయలో షర్మిల.. కాంగ్రెస్‌లో విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం!

వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్‌లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు.

New Update
Sharmila: ఇడుపులపాయలో షర్మిల.. కాంగ్రెస్‌లో విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం!

వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్‌లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా నివాళులు అర్పించనున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో తన పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గురువారం ఢిల్లీ వెళ్లి మరి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని కలిసి పార్టీ విలీనంపై చర్చించిన సంగతి తెలిసిందే. దీంతో తన తండ్రి వర్థంతి రోజున విలీనం గురించి ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

షర్మిల రాకను వ్యతిరేకిస్తున్న రేవంత్ వర్గం.. 

కొంతకాలంగా ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో షర్మిల అనేకసార్లు చర్చలు జరిపారు. తాజాగా సోనియాతో కలిసి తెలంగాణ రాజకీయాలతో పాటు పార్టీ విలీనం, పొత్తుల అంశాలపై చర్చించినట్లు చెబుతున్నారు. విలీనానికి సోనియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు వైఎస్ ఘాట్ సాక్షిగా ఆమె తన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. మరోవైపు షర్మిల రాకను టీపీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైఎస్ అనుచరులుగా ఉన్న కోమటిరెడ్డి వంటి నేతలు మాత్రం ఆమెను స్వాగతిస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లోకి షర్మిలను తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

అన్న జగన్‌తో చెల్లి ఢీ..!

అయితే ఏపీకి షర్మిల వస్తే జగన్‌తో ఢీ అంటే ఢీ అనే విధంగా రాజకీయాలు చేసే అవకాశాలున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వస్తే వైసీపీ నుండి కూడా వలసలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీలోని అసంతృప్తి నేతలు షర్మిల వైపుకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక షర్మిలతో ఇప్పటకీ టచ్ లో కొంతమంది నేతలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కొంత మంది వైసీపీ నేతలు షర్మిల ఏపీ కి వస్తే.. ఆమె వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగానే అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అన్నాచెల్లెల ఫైట్‌పై ఆసక్తి నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు