YS Sharmila: కడప పార్లమెంట్‌లో షర్మిలకు డిపాజిట్ గల్లంతైంది. కడపలో పోలైన మొత్తం ఓట్లు మొత్తం 13 లక్షల 21వేల 975. అయితే, డిపాజిట్‌కు కావాల్సిన ఓట్లు 2 లక్షల 20వేల 329. కానీ, షర్మిలకు వచ్చిన ఓట్లు 1,41,039. దీంతో షర్మిల డిపాజిట్ కోల్పోయింది. కానీ, షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి లాభపడ్డారు.
Also Read: ఏపీ ఎమ్మెల్యే కి పవన్ మాజీ భార్య అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్!
కడప వైసీపీ ఎంపీ అవినాష్‌కు 6 లక్షల 51వేల 43 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి ఉన్నారు. ఆయన 5 లక్షల 42వేల 448ఓట్లు సాధించారు. అవినాష్‌రెడ్డి 62వేల 695 ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. షర్మిల పోటీతో లక్షా 41వేల ఓట్లు చీలాయి. షర్మిల పోటీతో టీడీపీ అభ్యర్థి విజయం మిస్సయింది.