YS Jagan: జగన్ పై ముప్పేట దాడి.. సొంతగడ్డ కడపను జగన్ కాపాడుకోగలడా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వైసీపీపై వ్యూహాత్యక దాడి చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లను చేర్చుకుంటూ ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ సొంత గడ్డ కడప జడ్పీ పీఠాన్ని దక్కించుకుని వైసీపీకి ఊహించని దెబ్బ కొట్టాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

New Update
YS Jagan: అసెంబ్లీకి నో.. జగన్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

YS Jagan: సహజంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నుంచి అధికార పక్షంలోకి జంపింగ్స్ జరుగుతూనే ఉంటాయి. తమకు ఓడిన పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదనో.. తామున్న పార్టీలో తమకు తగినంత ప్రాధాన్యం లేదనో ఇలాంటి రకరకాల కారణాలు ఈ పార్టీల మార్పు వెనుక ఉంటాయి. అధికారం కోల్పోయిన పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా అధికార పక్షం వైపు చేరిపోవడమూ సహజమే. ఎందుకంటే, తమ నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలనేది ఈ జంపింగ్ కు కారణంగా వారు చెబుతుంటారు. ఇప్పుడు సేమ్ సీన్ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీ నాయకుల్లో.. నేతల్లో చాలా నిరాశ కనిపిస్తోంది. కరుడుకట్టిన వైసీపీ నేతలు కూడా ఫలితాల పట్ల తీవ్ర అసంతృప్తిని బహిర్గతంగానే వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ జంపింగ్ మంత్రం జపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మరింతమంది ఎంపీలు ఉన్నారని చెబుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం గట్టిగా నడుస్తోంది. 

YS Jagan: ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల నుంచి కూడా వైసీపీకి చెందిన నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యేల కంటే.. స్థానిక సంస్థలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఏలూరు, నందికొట్కూరు, పుంగనూరు వంటి మున్సిపాలిటీల నుంచి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ లోకి జంప్ అయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టి వాటిని టీడీపీ ఖాతాలో వేసుకుంది. తాజగా మాచెర్ల మున్సిపాలిటీలో కూడా 12 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీ విడిచిపెట్టేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఆ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం పెట్టనున్నారు. 

YS Jagan: ఒక పక్క ఎంపీలు.. మరో పక్క ఎమ్మెల్యేలు.. ఇంకోపక్క మున్సిపాలిటీ కౌన్సిలర్లు పార్టీని విడిచిపెడుతుండటం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారుతోందని చెప్పవచ్చు. టీడీపీ ముప్పేట దాడిలో జగన్ చిక్కుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమి నుంచి తేరుకొని పార్టీకి ఈ ముప్పేట రాజీనామాల వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉంటే తాజగా జగన్ సొంత ఇలాకా కడపలోనూ భారీగా జంపింగ్స్ చోటుచేసుకోనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కడప మున్సిపాలిటీకి సంబంధించి మెజార్టీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. దీంతో కడపలో అవిశ్వాసం పెట్టడానికి టీడీపీ రెడీ అవుతోందని తెలుస్తోంది. మిగిలిన చోట్ల చోటు చేసుకుంటున్న ఫిరాయింపులతో ఇప్పటికే ఇబ్బందుల్లో వైసీపీ ఇప్పుడు కడప లో రాబోతున్న పరిణామాలతో మరింత ఇరకాటం కలిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి కడప సొంత ఇలాకా. అక్కడ దెబ్బ తినడం అంటే జగన్ వ్యక్తిగత ప్రతిష్ట మంట కలవడమే అనే భావన ప్రజల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈసారి కడప జిల్లాలో కాస్త ఇబ్బందికర పరిస్థితులే వైఎసీపీకి ఎదురయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ జెండా ఎగిరితే మరింత అప్రతిష్ట పాలవడం ఖాయం అని పరిశీలకులు భావిస్తున్నారు. 

YS Jagan: ఇప్పుడు ఈ ముప్పేట దాడి నుంచి జగన్ ఎలా బయటపడతారనేది ఆసక్తిగా ఉంది. పార్టీని ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేసే ప్రయత్నాలు ఇంతవరకూ పూర్తిస్థాయిలో జరగలేదనేది వాస్తవమని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపులను నిలువరించడం.. పార్టీని ఓటమి మూడ్ నుంచి బయటకు తీసుకురావడం.. మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధం కావడం ఈ మూడు టాస్క్ లకు జగన్ ఎలాంటి పరిష్కారం తెస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. 

Advertisment
తాజా కథనాలు