YS Jagan: అధైర్య పడొద్దు.. నేతల వద్ద ఓటమిపై జగన్ సంచలన రియాక్షన్!

ఎన్నికల ఫలితాలపై నేతలెవరూ అధైర్య పడొద్దని, మనకు రావాల్సిన ఓట్‌ షేర్‌ వచ్చిందని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ రోజు ఆయన సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు అధినేత ఎదుట సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

New Update
YS Jagan: అధైర్య పడొద్దు.. నేతల వద్ద ఓటమిపై జగన్ సంచలన రియాక్షన్!

ఓటమి తర్వాత తొలిసారి పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఓడిన నేతలతో జగన్‌ మాట్లాడారు. ఎవరూ అధైర్య పడొద్దని, మనకు రావాల్సిన ఓట్‌ షేర్‌ వచ్చిందని వారితో జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు అధినేత ఎదుట సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ ఓట్లు రాకపోవడంపై అనుమానాలు ఉన్నాయని వారు చెప్పినట్లు సమాచారం. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని నేతలు జగన్ కు వివరించినట్లు సమాచారం.

కూటమి అనుకూల అధికారులు, పోలీసులు మధ్య కుమ్మక్కు నడిచిందని నేతలు చెప్పారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నేతలను ఉద్దేశ పూర్వకంగా భయబ్రాంతులకు గురిచేశారని, పోలింగ్‌ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారని నేతలు జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని సూచించారు. కార్యకర్తలకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

Advertisment
తాజా కథనాలు