గత ఏడాది పాము విషాన్ని రేవ్ పార్టీలో వినియోగించాడనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ హిందీ ఓటీటీ బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొంత కాలంగా పరారీలో ఉన్న ఎల్విష్ ను ఆదివారం నోయిడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. రిమాండ్ లో ఉంచి పోలీసులు విచారించగా అతను కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీల కోసం అతడు పాములను వాటి విషయాన్ని ఆర్డర్ చేసేవాడని తేలిందన్నారు. ఇప్పటికే కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులతో ఎల్విష్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
గత ఏడాది నవంబర్ లో నోయిడాలోని సెక్టార్ 49 లో జరుగుతున్న ఓ రేవ్ పార్టీ పై పోలీసులు దాడులు నిర్విహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి కొన్ని పాములను 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఎల్విష్ యాదవ్ పేరును ఎఫైఆర్ లో పోలీసులు చేర్చారు.
ఎల్వీష్ కొన్ని పాములు పట్టుకున్న వీడియో బయటకి రావటంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో అదుపులో తీసుకున్న వ్యక్తులను విచారించగా అసలు విషయం తెలిసింది. ఎల్విష్ రేవ్ పార్టీలకు పాములను వాటి విషాన్ని సరఫరా చేస్తాడని నిందితులు పోలీసులకు చెప్పారు. ఇందుకోసం భారీగా డబ్బు తీసుకుంటామని వారు అంగీకరించారు. వారిని అదుపులో తీసుకున్నారని తెలిసిన వెంటనే ఎల్విష్ పరారైయాడు.