Vijay Devarakonda: తనదైన మేనరిజంతో టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ నిర్మించుకున్న హీరో విజయ్ దేవరకొండ. బిజీ షెడ్యూలులో తలమునకలై ఉన్న విజయ్ ఓ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నాడు. తనపై, తన సినిమాల్లోని హీరోయిన్లపై చెత్తవాగుడు వాగిన ఓ యూట్యూబర్ కు చుక్కలు చూపించాడు.
ఇంతకూ ఏమైందంటే...
రౌడీ హీరో విజయ్ దేవరకొండపై ఓ వ్యక్తి యూట్యూబ్ తన ఛానెల్ లో నోటికొచ్చినట్టు వాగాడు. అసభ్యకరంగా కూడా కామెంట్లు చేశాడు. అనంతపురానికి చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తికి సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో విజయ్ ను అవమానిస్తూ ఫేక్ న్యూస్ ప్రసారం చేశాడు. దీన్ని విజయ్ సీరియస్ గా తీసుకున్నాడు. విషయం పోలీసుల వరకూ చేరింది.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటున్న యానిమల్ భామ!
ఆచూకీ తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి గట్టిగానే కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ వీడియోలతో పాటు ఛానల్‌నూ డిలీట్ చేయించారు పోలీసులు. ఇకముందు మరోసారి ఇలాంటి చేష్టలకు పాల్పడొద్దని గట్టిగా హెచ్చరించారు.