/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/youtuber-jpg.webp)
Youtuber Chandra Shekar Sai kiran Arrest: ప్రముఖ యూట్యాబర్.. కోల చంద్రశేఖర్ సాయి కిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. తనను వదిలేశాడని.. ఓమహిళ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సాయి కిరణ్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడకు తరలించారు.
Also Read: మహువా ఎంపీ సభ్యత్వం రద్దు వ్యవహారం.. సుప్రీంకోర్టులో విచారణ..
2021లో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ తరుణంలో సాయి కిరణ్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. అంతేకాదు పెళ్లి పేరుతో ఆ యువతి దగ్గర ఉన్న బంగారాన్ని సైతం తీసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకోవడానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా సాయి కిరణ్ కుటుంబం ఆ యువతిపై వేధింపులకు దిగారు.
Also Read: టీడీపీకి షాక్…పాలిటిక్స్ కు గల్లా గుడ్ బై!
ఇక ఇరువురి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి.. కులం పేరుతో ఆ అమ్మాయిని దూషించసాగాడు. పెళ్లికి మొహం చాటేయడంతో ఆ యువతి నార్సింగ్ పోలిసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 14 రోజుల రిమాండ్ వేధించడంతో చంద్రశేఖర్ సాయి కిరణ్ సహా.. యువతిపై వేదింపులకు దిగిన కుటుంబ సభ్యులను చంచల్ గూడ జైలుకు తరలించారు.