Beauty: వ్యాక్సింగ్ తర్వాత ఈ పనులు చేయండి.. లేకపోతే మీ చర్మం నల్లగా మారవచ్చు! అమ్మాయిలు చేతులు, కాళ్లను అందంగా మార్చుకోవడానికి వ్యాక్సింగ్ చేయించుకుంటారు. వ్యాక్సింగ్ తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్, టోనర్, అలోవెరా జెల్‌ను వాడాలని నిపుణులు అంటున్నారు. వ్యాక్సింగ్ తర్వాత 2,3 రోజుల తర్వాత డెడ్‌స్కిన్ తొలగించడానికి వారానికి మూడుసార్లు స్క్రబ్ ఉపయోగించాలి. By Vijaya Nimma 08 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Beauty: వ్యాక్సింగ్ తర్వాత అమ్మాయిల చేతులు, కాళ్ల నుంచి టానింగ్ తొలగించి చర్మం మృదువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల చేతులు, కాళ్ళపై అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. చేతులు, కాళ్ళు అందంగా కనిపిస్తాయి. మీరు వాక్సింగ్ చేసుకున్నప్పుడల్లా.. వ్యాక్సింగ్ తర్వాత కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాక్సింగ్ తర్వాత చాలాసార్లు చర్మం చెమట పట్టటం, జిగటగా మారుతుంది. ఇది జరిగినప్పుడు చాలామంది అమ్మాయిలు వేడి , గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం నల్లబడటం మొదలవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు, కొన్ని చిట్కాలు ఫాలో చేయాలి. వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డెడ్ స్కిన్‌కి చెక్: వాక్సింగ్ తర్వాత.. చనిపోయిన చర్మం రంధ్రాలను మూసుకుపోతుంది. ఇది చర్మం నల్లబడటానికి దారితీస్తుంది. వాక్సింగ్ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత.. డెడ్ స్కిన్ తొలగించడానికి వారానికి మూడు సార్లు స్క్రబ్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. మాయిశ్చరైజింగ్ లోషన్: చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ లోషన్‌ను ఉపయోగించవచ్చు. వాక్సింగ్ తర్వాత అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. వ్యాక్సింగ్ తర్వాత.. ఎండలోకి వెళ్తే చర్మం నల్లగా మారవచ్చు. అందుని బయటకు వెళ్తే.. ఖచ్చితంగా సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. టోనర్: కండువా, టోపీ, అద్దాలు వాడితే సూర్యుని నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. టోనర్ చర్మ రంధ్రాలను మూసివేసి చర్మాన్ని బిగుతుగా మార్చుస్తుంది. దీనికోసం రోజ్ వాటర్ సహజ టోనర్‌ను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని శాంతపరుస్తుంది. అలోవెరా జెల్: వాక్సింగ్ తర్వాత.. కొంతమందికి చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. అది నయమయ్యే వరకు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ టైంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్, టోనర్ వాడాలి. ఎండలో వెళ్లకుండా ఉండాలి. వాక్సింగ్ తర్వాత చర్మం నయం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. అందువల్ల.. భయపడవద్దు, అలోవెరా జెల్ వంటి వాటిని వాడుకోవచ్చు. వాక్సింగ్ తర్వాత మీ చర్మం దురదగా ఉంటే.. దురదను నివారించకుంటే చర్మానికి హాని కలిగిస్తుంది. ఈ సమస్యలు ఎక్కువ రోజులుంటే అప్పుడు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: పెరిగిన కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావాలంటే? ఈ 5 పనులు చేయండి! #waxing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి