Crime News: ప్రేమించాలంటూ ఇద్దరి యువకుల వేధింపులు.. బరించలేక ఆ యువతి ఏం చేసిందంటే?

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో విషాదం చోటు చేసుకుంది. తమను ప్రేమించాలంటూ కల్యాణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన శివ, మధు తీవ్రంగా వేధించారు. దీంతో వీరి వేధింపులు తట్టుకోలేక యువతి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది.

New Update
Crime News: ప్రేమించాలంటూ ఇద్దరి యువకుల వేధింపులు.. బరించలేక ఆ యువతి ఏం చేసిందంటే?

Also Read: టీడీపీ కార్యాలయంపై దాడి… వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్

అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు ప్రేమ పేరుతో కల్యాణిని వేధించారు. తాము చెప్పినట్లు వినకపోతే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతామంటూ కల్యాణికి బెదిరించారు. తరుచు వేధిస్తుండడంతో ఆ యువతి భరించలేకపోయింది.

ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆ యువతి పురుగుల మందు తాగింది. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన చావుకు ఇద్దరు యువకులే కారణమంటూ యువతి జడ్జి ఎదుట మరణ వాంగ్మూలం ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు