టీవీ చూడొద్దని మందలించిన తండ్రి.. క్షణికావేశంలో యువతి దారుణం

టీవీ, ఫోన్ తరచూ చూడొద్దని తండ్రి మందలించినందుకు ఓ యువతి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నాన్న ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనువు చాలించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

New Update
టీవీ చూడొద్దని మందలించిన తండ్రి.. క్షణికావేశంలో యువతి దారుణం

టీవీ, ఫోన్ తరచూ చూడొద్దని తండ్రి మందలించినందుకు ఓ యువతి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నాన్న ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె మనస్థాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనువు చాలించి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తీరని శోకం మిగిల్చింది.

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్సై సత్యం తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా, రావల్‌వెల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన కె.స్వామిగౌడ్‌, సరిత దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పాపిరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. వారికి కుమారుడు రవికుమార్‌, కుమార్తె దివ్య(21) పిల్లలున్నారు. స్వామిగౌడ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రవికుమార్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కూతురు దివ్య కూడా డిగ్రీ పూర్తిచేసిన తర్వాత కొంతకాలం ఓ ప్రైవేటు ఉద్యోగం చేసింది. అయితే అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది. దీంతో ఇంట్లో టీవీ, ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతుండటంతో ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోమని తండ్రి చెబుతున్నాడు. అయినా ఆమె జాబ్ చూసుకోకుండా ఇంట్లోనే ఉంటూ టీవీ, ఫోన్ కు అడిక్ట్ కావడంతో స్వామిగౌడ్‌ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

Read also :లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతి..పిల్లలతో బీ అలర్ట్!

అయితే దివ్య చనిపోయేముందు ఓ లెటర్ కూడా రాసింది. 'నాన్నా ఇక నేను టీవీ చూడను. ఫోన్‌ చూడను. ఎవరికీ చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇకపై మీకు నానుంచి ఎలాంటి సమస్య ఉండదు' అని లెటర్ లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ ఉత్తరం స్వాధీనం చేసుకుని దాని ఆధారంగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు