మునగాకు జూస్ తో వృద్ధాప్యం పరార్..!

వయసు పెరిగినా యవ్వనంగా, ఫిట్ గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ప్రతి ఒక్కరూ తమ వయసు ఎంత అయినప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక అలా యవ్వనంగా కనిపించాలి అనుకునే వారికి ఓ అద్భుతమైన ఆకు ఊహించని మంచి ఫలితాలను ఇస్తుంది. అదే మునగాకు.

New Update
మునగాకు జూస్ తో వృద్ధాప్యం పరార్..!

మునగాకు పోషకాల గని. మునగాకుల్లో మనకు కావాల్సిన పోషకాలు విటమిన్లు, మినరల్స్ సంవృద్దిగా ఉంటాయి. క్యారెట్ తింటే వచ్చే విటమిన్ ఏ ని పది రెట్లు మునగాకుతో పొందవచ్చు. పాల నుండి లభించే కాల్షియం 17 రెట్లు మునగాకు నుండి వస్తుంది. అరటిపండు నుండి పొందే పొటాషియం 15 రెట్లు మునగాకు నుండి లభిస్తుంది. అలాంటి మునగాకు మనల్ని 300రోగాల నుండి కాపాడుతుంది.

మునగాకు రసం తాగితే అనారోగ్యాల ముప్పు తగ్గుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ జ్యూస్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. విబ్రియో కలరా, స్టాఫిలోకోకస్ ఆరియస్ వంటి యాంటీ బయోటిక్ నిరోధకత కలిగిన సూక్ష్మజీవులపై మునగాకు రసం ప్రభావం చూపిస్తుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది.

మునగాకు జ్యూస్ మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు తీసుకోవాలి. ఇది రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలను శుభ్రం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మునగాకు రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ కూడా శుభ్రం అవుతుంది. అల్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది.

మునగాకు రసాన్ని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా మారుతుంది. మీ వయసు ఎంత అయినప్పటికీ ఎవర్ యూత్ గా కనిపిస్తారు. కాబట్టి మునగాకు యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉండాలనుకునేవారు క్రమం తప్పకుండా మితంగా మునగాకు జ్యూస్ ను తీసుకోండి. ఇక మునగాకు జ్యూస్ ఏ విధంగా తీసుకోవాలో నేచురోపతి వైద్యులను సంప్రదించి తెలుసుకోండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు