SHOCKING DEAD BODY VIDEO :మారుతున్న సాంకేతికతో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోన్న తరుణమిది. ఓ వైపు అంతరిక్ష ప్రయోగాలతో సంబరాలు చేసుకుంటున్న మన దేశంలో .. వైద్య సదుపాయాల్లో మాత్రం సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో కనీస వైద్య సదుపాయాలు లేక మంచాలనే డోలీలా తయారు చేసి అనారోగ్యంతో బాదపడుతున్నవారిని మోసుకుని వెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి.ఇలాంటి హృదయవిదారక ఘటనలు చూస్తున్నప్పుడు దేశం ఎటు వెళ్తోంది అన్న సంశయం కలగక మానదు. ఒడిస్సా, కోరాఫుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ర్ గా మారిన ఈ విషాద ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే ..
అత్తారింట్లో అంత్యక్రియలు
ఒడిస్సా, కోరాఫుట్ జిల్లా పూర్ణ గూడెం పంచాయితీ ,కుమిలి గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల వయసున్న వివాహిత కరుణ అమృత్యో అనే గిరిజన మహిళ తన పుట్టింట్లో అనారోగ్యంతో మృతి చెందింది.అయితే వారి గిరిజన సాంప్రదాయం ప్రకారం అంతేక్రియలు అత్తగారి ఊరైన నవరంగపూర్ జిల్లాలోని నందాహుండీ సమితి జగన్నాథ్ పూర్ పంచాయతీ పుష్పంగాలోని నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారు.
వైరల్ వీడియో
20కి.మీ మృతదేహాన్ని మోసిన యువకులు
ఈక్రమంలో మృతదేహాన్నిఅంత్యక్రియల కోసం అత్తారింటికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం అంబులెన్స్ అందుబాటులో లేదు.పోనీ ప్రైవేట్ అంబులెన్స్ లో తరలిద్దామంటే వారి ఆర్థిక పరిస్థితి సైతం సహకరించలేధు..అంబులెన్స్ కి అద్దె చెల్లించలేని దయనీయ పరిస్థితిలో కుమిలి గ్రామంలోని యువకులు ముందుకొచ్చి మంచాన్ని డోలీలా తయారు చేసి సుమారు 20 కిలోమీటర్లు అత్తగారింటికి మృతదేహాన్ని మూసుకెళ్లారు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఒడిస్సా లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు మాత్రం ఉదాసేనంగా వ్యహరించడం బాదాకరం. ఈ ఘటనతోనైనామారుమూల గ్రామాల్లో కనీస వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు.,
ALSO READ:ఆలయంలో కూలిన స్టేజీ.. ఒకరు మృతి, 17 మందికి గాయాలు