Clove Health: కిచెన్ లో స్పైసెస్ వాడకుండా వంటకు రుచిని పెంచడం చాలా కష్టం. ఇండియన్ స్పైసెస్ ప్రత్యేకమైన ఫ్లేవర్, రుచిని కలిగి ఉంటాయి. స్పైసెస్ రుచితో పాటు చాలా రకాల వ్యాధులకు కూడా మంచి చిట్కాలా పనిచేస్తాయి. వీటిలో ముఖ్యంగా లవంగం.. ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ దీని వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడును.
లవంగం తీసుకుంటే కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి
కడుపు నొప్పి, అజీర్ణత సమస్యల నుంచి ఉపశమనం
రోజూ ఉదయం నీటిలో కొన్ని డ్రాప్స్ లవంగం నూనె వేసుకొని ఆ నీటిని తాగాలి. ఇవి అజీర్ణత, మలబద్దకం, యాసిడిటీ, గ్యాస్ నొప్పి వంటి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించును.
మొహం పై నల్లటి మచ్చలను తొలగించును
లవంగం కూడా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో మంచి చిట్కాల ఉపయోగపడును. చాలా మందికి లవంగంతో ఇలాంటి లాభాలు ఉన్నాయని తెలియదు. లవంగం పొడిని శనగ పిండి, తేనెతో కలిపి మొహానికి అప్లై చేస్తే మొహం పై మచ్చలు, మురికి, డెడ్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయును.
జుట్టును దృఢంగా చేయును
కొంత మంది పొడి బారిన, విరిగిన జుట్టుతో బాధపడతారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి లవంగం మంచి చిట్కా. వేడి చేసిన లవంగాలను నీటిలో కలిపి వాటితో తల స్నానం చేస్తే మంచి ప్రభావం ఉంటుంది. ఇది జుట్టును ఒత్తుగా, బలంగా తయారు చేయును.
నోటి దురువాసనను తగ్గించును
నోటి దురువాసన సమస్యతో బాధపడేవారు ప్రతీ రోజు ఉదయాన్నే 2 లేదా 3 లవంగాలను నోట్లో వేసుకోవాలి. 40-45 రోజులు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభించును.
మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచును
లవంగంలోని ఫ్లెవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ స్పెర్మ్ కౌంట్ పెంచడంలో మెరుగ్గా పనిచేస్తాయి. మగ వారు రోజు ఒక నాలుగు లవంగాలు తీసుకుంటే మంచి ప్రభావం ఉండును.
Also Read: Mental Health Tips: ఒత్తిడిగా ఉందా.. అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి