ముఖంపై మొటిమల నుంచి నల్ల మచ్చల వరకు.. ఈ హోం రెమెడీస్‎తో చెక్ పెట్టండి..!!

వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మన చర్మంలో ముందుగా మార్పులు కనిపిస్తాయి. సన్నిగీతలు, ముడతలు, నల్లని మచ్చలు రావడం సాధారణమే. హార్మన్ల మార్పులు, వృద్ధాప్య చర్మ సమస్యలు, ముఖంపై నల్లని మచ్చలు, ప్యాచ్ లు కనిపిస్తుంటాయి. హైపర్మిగ్మేంటేషన్ అని పిలిచే ఈ నల్లమచ్చలను వదలించుకునేందుకు కొందరు స్కిన్ స్పెషలిస్ట్ సహాయం తీసుకుంటారు. అయితే స్కిన్ స్పెషలిస్టుతో అవసరం లేకుండానే కొన్ని హోం రెమెడీస్ తో ఈ సమస్యను తక్షణమే పరిష్కరించుకోవచ్చు.

New Update
ముఖంపై మొటిమల నుంచి నల్ల మచ్చల వరకు.. ఈ హోం రెమెడీస్‎తో చెక్ పెట్టండి..!!

అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. కొంతమంది అయితే ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ వయస్సు పెరుగుతున్నా కొద్దీ చర్మం అందం తగ్గుతూ ఉంటుంది. పటత్వాన్ని కోల్పోవడమే కాకుండా..మొటిమలు, నల్లని మచ్చు, కళ్లచుట్టూ డార్క్ సర్కిల్స్, సన్నని గీతలు ఇలా ఎన్నో చర్మ సమస్యలు వయస్సు పెరిగే కొద్దీ వస్తుంటాయి. వృద్ధాప్యాన్ని ఆపడం సాధ్యంకాకపోవచ్చు. కానీ మీ చర్మాన్ని రక్షించడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు సహాయపడతాయి. ముఖంపై మొటిమల నుంచి నల్లటి మచ్చల వరకు తొలగించి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అవేంటో చూద్దాం.

rid from dark spots on face
టొమాటో:
టమోటాల్లో విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజంగా చర్మ అందాన్ని పెంచుతుంది. అంతేకాదు హైపర్పిగ్మెంటేషన్ ఫేడ్ చేయడంలో సహాయపడుతుంది. టొమాటో జ్యూస్‌లో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి డార్క్ స్పాట్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. టొమాటోను ముక్కలుగా చేసి, ఆ గుజ్జును నేరుగా మచ్చలున్న ప్రాంతాలపై రుద్దండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.

పసుపు:
పసుపును చాలా హోం రెమెడీస్‌లో ఉపయోగిస్తారు. పిగ్మెంటేషన్ తగ్గించడానికి, చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు పసుపులో ఉన్నాయి. పసుపును ఉపయోగించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, పసుపు పొడిని పాలు లేదా తేనెతో కలిపి పేస్ట్ లా చేసి, నల్ల మచ్చలపై అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి.

బియ్యం నీరు:
పులియబెట్టిన బియ్యం నీటిని ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు తగ్గుతాయి, చర్మం టానింగ్ అవుతుంది. అధ్యయనాల ప్రకారం, పులియబెట్టిన బియ్యం నీటిలోని ఖనిజాలు చర్మ కణాల టైరోసినేస్ చర్యను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నాయి. ఇది చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది.

నిమ్మరసం:
ముఖంపై నల్ల మచ్చలను తగ్గించడానికి మరో శక్తివంతమైన మార్గం నిమ్మరసాన్ని చర్మంపై అప్లై చేయడం. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసం చర్మానికి సహజమైన బ్లీచ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసం వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో చర్మంపై చికాకు కలిగిస్తుంది. నిమ్మరసంలో తేనె, టొమాటో రసం మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా జెల్:
హైపర్‌పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్‌ని సరిచేయడానికి ఒక సింపుల్ రెమెడీ అలోవెరాను చర్మంపై అప్లై చేయడం. తాజా కలబంద జెల్‌లో అలోయిన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి డార్క్ స్పాట్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖాన్ని కాంతివంతం చేస్తాయి. తాజా కలబంద జెల్‌ను ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీటితో కడిగేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు