UP Halal : యోగీ సర్కార్ సంచలన నిర్ణయం...యూపీలో హలాల్ ఉత్పత్తులు నిషేధం..తక్షణమే అమల్లోకి...!! యూపీలో అధికారంలో ఉన్న యోగీ సర్కార్ ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. By Bhoomi 18 Nov 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి uttar pradesh halal : ఎన్నికలకు ముందు యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని యోగీ సర్కార్ వెల్లడించింది. దీంతో ఇక నుంచి యూపీలో హలాల్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో హలాల్ ఉత్పత్తుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీ సర్కార్ ఈ రోజు హలాల్ ట్యాగ్ తో కూడిన ఉత్పత్తులను పూర్తిగా నిషేధం విధించింది. ప్రజారోగ్యం కారణంగా హలాల్ ధ్రువీక్రుత తినదగిన వస్తువుల ఉత్పత్తి, స్టోరేజీ, పంపిణీ అమ్మకాలు తక్షణమే యూపీలో నిషేధిస్తున్నట్లు ఫుడ్ కమిషన్ కార్యాలయం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విక్రయించే రిటైల్ ఉత్పత్తులకు చట్టవిరుద్ధమైన హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు లక్నో పోలీసులు పలు సంస్థలపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అధికారం లేకుండా ఆహారం, సౌందర్య ప్రొడక్టులకు హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసే అక్రమ సంప్రదాయాన్ని అరికట్టేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారని ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు. నేడు ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హలాల్ ఉత్పత్తులు ప్రధానంగా మాంసాహార ఉత్పత్తులు కావడం, వీటిని ఉత్పత్తి చేసేవారు అమ్మేవారు ముస్లిం వర్గాలకు చెందినవాళ్లు కావడంతో ఎన్నికలకు ముందు యోగీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో పూర్తిగా హిందూత్వ అజెండా అమలు చేసేందుకు బీజేపీ భావిస్తోంది. ఇది కూడా చదవండి: వందలాది ఉద్యోగులు తొలగింపు..ఇప్పటికే 27వేల మంది ఔట్…కారణాలివే..!! #up-halal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి