Udhayanidhi Stalin: ఉదయ నిధి తల నరికితే రూ. 10 కోట్ల రివార్డ్.. కలకం రేపుతున్న ప్రకటన..

సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి తల తీసుకువచ్చిన వారికి రూ. 10 కోట్ల రివార్డ్ ఇస్తామంటూ ప్రకటించారు.

New Update
Udhayanidhi Stalin: ఉదయ నిధి తల నరికితే రూ. 10 కోట్ల రివార్డ్.. కలకం రేపుతున్న ప్రకటన..

Sanatana Dharma Row: రామనగరి అయోధ్యలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత తనయుడు ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సనాతన హిందూ ధర్మంపై(Sanatana Dharma Row) వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. అయోధ్యలోని సన్యాసి కంటోన్మెంట్‌కు చెందిన సంత్ జగత్ గురు పరమహంస ఆచార్య(Paramahamsa Acharya) ఉదయనిధి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదే సమయంలో ఉదయనిధి ఫోటోలో తలను కత్తితో కట్ చేశారు. అంతేకాదు.. ఉదయనిధి తల ఎవరు తీసుకువస్తారో.. వారికి రూ. 10 కోట్లు రివార్డ్ కూడా ఇస్తామని పరమహంస ఆచార్య తెలిపారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి మాట్లాడిన మాటలు తనను తీవ్రంగా బాధించాయన్నారు.

లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉన్నది సనాతన ధర్మం ఒక్కటే అని పరమహంస ఆచార్య అన్నారు. ఇప్పుడున్న మతాలన్నీ కొత్తగా పుట్టుకొచ్చినవే అని అన్నారు. పూర్వం ఒకే మతం ఉండేదని, అది సనాతన ధర్మం అని అన్నారు. సనాతన ధర్మానికకి ఆది, అంతం లేదని అననారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరని వ్యాఖ్యానించారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తే.. వారే కాలగర్భంలో కలిసిపోతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పరమహంస ఆచార్యం.

ఎవరూ చేయకపోతే నేనే ఆ పని చేస్తా..

డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి తలను తీసుకువచ్చే వారికి రూ. 10 కోట్లు రివార్డ్ ఇస్తానని పరమహంసం ప్రకటించారు. అయితే, ఎవరూ ఆ పని చేయకపోతే.. తానే స్వయంగా ఉదయనిధి తలను తీసేస్తానంటూ సంచనల కామెంట్స్ చేస్తారు. ఇందుకోసం కత్తిని కూడా సిద్ధం చేశానని అన్నారు. నేనే వెళ్లి ఉదయనిధిపై అటాక్ చేస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి.

ఇతర మతాలపై ఇలాంటి కామెంట్స్ చేసే దమ్ముందా?

జగత్ గురువు పరమహంస ఆచార్య మాట్లాడుతూ.. ఉదయనిధికి ఇతర మతాల గురించి ఇలాగే మాట్లాడే ధైర్యం ఉందా? ఒకవేళ అతను ఈ కామెంట్స్ వేరే మతాలపై చేసి ఉంటే.. ఈపాటికి ముక్కలు ముక్కలై ఉండేవాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం మానవతావాదం, అహింసకు మద్ధతుగా ఉంటుంది. 'సనాతన ధర్మాన్ని నమ్ముకున్న మేము మానవతావాదులమే. కానీ, చెడును కూడా అంతమొందించే ధైర్యం ఉంది. రాక్షసులను కూడా మట్టుబెట్టే తత్వాన్ని సనాతన ధర్మం నేర్పుతుంది. ఉదయనిధి ఇప్పుడు రాక్షసుడే' అని వ్యాఖ్యానించారు పరమహంస ఆచార్య.

Also Read:

Ram Charan: ఉదయ్‌నిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై రామ్‌చరణ్ ట్వీట్ వైరల్

Telangana Elections: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు