Diabetes: ఈ ఆసనాలతో.. మధుమేహానికి బాయ్ బాయ్ చెప్పండి ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు శారీరక శ్రమ, యోగ కూడా మధుమేహ సమస్య పై మంచి ప్రభావం చూపుతాయి. రోజూ ఈ యోగాసనాలు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పశ్చిచమొత్తాసనం, తాదాసన, భుజంగాసనం, వృక్షాసనం, శవాసనం. By Archana 14 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Diabetes: ఈ మధ్య కాలం చాలా మందిని ఎక్కువగా బాధపెడుతున్న సమస్య మధుమేహం. పెద్ద, చిన్న వయసుతో సంబంధం లేకుండా అందరిలో ఈ సమస్య కామన్ అయిపోయింది. ఆహారపు అలవాట్లు, జీవశైలి విధానాలు దీనికి ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. ఈ సమస్యను తగ్గించడానికి ఆరోగ్యమైన ఆహారం ఒక్కటి తీసుకుంటే సరిపోదు శారీరక శ్రమ కూడా చేయాలి. ప్రతీ రోజు ఈ యోగాసనాలు చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము... పశ్చిచమొత్తాసనం ఈ ఆసనం వేసినప్పుడు వెన్ను, చేతులు, కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇది శరీరంలోని కిడ్నీ, లివర్ వంటి అవయవాలను ఉద్దేపింపజేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడి.. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. భుజంగాసనం ఆ ఆసనం ద్వారా వెనుక భాగం ఉన్న కండరాళ్ళు బలంగా మారుతాయి. ఇది పొత్తికడుపును సంబంధించిన అవయవాలను ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియతో పాటు జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శవాసనం శవాసనం మానసిక ప్రశాంతతను కలిగించి.. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఒత్తిడి రక్తంలో చక్కర స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా కాస్త ఒత్తిడి తగ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తదాసనం తదాసనం మోకాళ్ళు , తొడలను దృడంగా చేస్తుంది. ఇది మెరుగైన రక్త ప్రసరణను తోడ్పడి.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. వృక్షాసనం వృక్షాసనం.. బ్యాలెన్స్, ఏకాగ్రత, నిశ్చలత్వాన్ని పెంచుతుంది. ఈ ఆసనం పాంక్రియాస్ ను ప్రేరేపించి.. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాపడుతుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: కిచెన్‌లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా?..ఈ ముప్పు తప్పదు #diabetes #yoga-poses మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి