నిన్న వాళ్లిద్దరు కౌగిలించుకున్నారు. ఈ రోజు ఆయన ఛాంబర్ కు ఈయన..ఏంటీ మ్యాటర్..టెన్షన్ లో కమలనాథులు!

అసెంబ్లీ మొదటి రోజే మంత్రి కేటీఆర్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యే,ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇద్దరు కౌగిలించుకొని ముచ్చటించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి ఆలింగనంతోనే దుమారం రేగుతున్న నేపథ్యంలో మళ్లీ ఈటల ఎందుకు కేటీఆర్ ఛాంబర్ దగ్గరికెళ్లారనేది రాజకీయ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది..!

నిన్న వాళ్లిద్దరు కౌగిలించుకున్నారు. ఈ రోజు ఆయన ఛాంబర్ కు ఈయన..ఏంటీ మ్యాటర్..టెన్షన్ లో కమలనాథులు!
New Update

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయంగా ఏ చిన్న  పరిణామాలు చోటుచేసుకున్నా తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ఉన్న కీలక నేతలు జారిపోకుండా కాపాడుకుంటూనే.. పార్టీలో చేరికల ప్రవాహాన్ని పారించాలని అధికార ప్రతిపక్షాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ మొదటి రోజే మంత్రి కేటీఆర్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యే,ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇద్దరు కౌగిలించుకొని ముచ్చటించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం రాజకీయాల్లో త్రిముఖ పోరు నడుస్తున్న క్రమంలో ఈటల కేటీఆర్ తో అంత సన్నిహితంగా ఉండడం పై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే నిన్న కేటీఆర్ ఇంకా ఈటల అసెంబ్లీ లాబీలోనే ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడే నిలబడి ఇద్దరు దాదాపుగా పది నిమిషాల పాటు ముచ్చటించుకున్నారు. ఆ నెక్ట్స్ డేనే ఈటల కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లారు. అయితే ఆ సమయంలో కేటీఆర్ శాసన మండలిలో ఉన్నారని అక్కడి స్టాఫ్ చెప్పడంతో ఆయన మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు.

అయితే నిన్నటి ఆలింగనంతోనే దుమారం రేగుతున్న నేపథ్యంలో మళ్లీ ఈటల ఎందుకు కేటీఆర్ ఛాంబర్ దగ్గరికెళ్లారనేది రాజకీయ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ రోజు అసెంబ్లీ సెషన్ లో ఈటలపై కేటీఆర్ సరదాగా సెటైర్లు వేయడంతో సభ్యులందరూ ఒక్కసారిగా నవ్వారు. ఈటల మంత్రిగా ఉన్న సమయంలో హుజురాబాద్ లో ఓ ఐటీ కంపెనీని ప్రారంభించారని.. ఆయన పార్టీ మారిన తరువాత ఆ కంపెనీ వచ్చిందా.. అని కేటీఆర్ సెటైర్ వేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈటల కేటీఆర్ ను కలవడానికి ప్రయత్నించడం రాజకీయంగా దుమారానికి దారితీస్తోంది.

ఈటల తీరుతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కొన్నాళ్ళుగా సాగుతున్న ప్రచారానికి ఆజ్యం పోసినట్లైంది. మరోవైపు బీఆర్ఎస్ ను ఎలాగైనా ఢీ కొట్టి ఈ సారి తెలంగాణలో గెద్దెనెక్కి.. సౌత్ లో మళ్లీ అడుగుపెట్టాలని బీజేపీ అధిష్టానం స్కెచ్ లు వేస్తున్న తరుణంలో.. ఈటల తీరు కథను మళ్లీ మొదటికి తీసుకొని వచ్చింది. మరి దీనిపై ఈటల ఇంకా బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe