Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి!

యెమెన్‌ తీరంలో వలస కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా..ఇద్దరు సిబ్బందితో కలిసి 14 మంది గల్లంతయ్యారు. వీరంతా తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

New Update
Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి!

Yemen : యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. యెమెన్‌ తైజ్‌ ప్రావిన్స్‌ (Yemen Taiz Province) తీరంలో మగళవారం పడవ బోల్తా (Boat Accident) పడడంతో 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 25 మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్ మైగ్రేషన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..యెమెన్‌ లోని తైజ్‌ ప్రావిన్స్‌ తీరంలో వలస కార్మికుల పడవ బోల్తా పడింది.

ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం (East Asia Country) ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుంచి వలస కార్మికులతో బయల్దేరింది. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గల్లంతైన వారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. యెమెన్‌లోని IOM మిషన్ తాత్కాలిక అధిపతి మాట్లాడుతూ.. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని వివరించారు.

Also Read: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

Advertisment
తాజా కథనాలు