AP Politics: పవన్, బాలయ్య, లోకేశ్ పై పోటీకి మహిళా అభ్యర్థులు.. జగన్ స్కెచ్ అదుర్స్!

జనసేనాని పవన్, ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేశ్ పై పోటీగా వైసీపీ మహిళ అభ్యర్థులను బరిలోకి దింపడం ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో పవన్‌పై పోటీగా వంగా గీత, మంగళగిరిలో లోకేష్‌పై మురుగుడు లావణ్య, హిందూపురంలో బాలకృష్ణపై TN దీపిక పోటీ చేయనున్నారు.

New Update
AP Politics: పవన్, బాలయ్య, లోకేశ్ పై పోటీకి మహిళా అభ్యర్థులు.. జగన్ స్కెచ్ అదుర్స్!

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో పార్టీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?

జగన్ స్పెషల్ ఫోకస్..

ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. అదేంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లకు పోటీగా వైసీపీ తరఫున మహిళా అభ్యర్థులు బరిలోకి దింపడం విశేషంగా మారింది. ప్రతిపక్ష్య ముఖ్య నేతలైన వారిని ఓడించాలనే ఇంటెన్షన్ తో కావాలనే జగన్ ఇలా  ప్లాన్ చేశారా లేదంటే అనుకోకుండా ఇలా అభ్యర్థులను ప్రకటించారా అన్న చర్చ మొదలైంది.


పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి వంగా గీత అనే అభ్యర్థిని, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు పోటీగా టీఎన్ దీపిక అనే అభ్యర్థిని, మంగళగిరిలో నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య అనే అభ్యర్థులను జగన బరిలో దింపాడు. దీంతో కీలక నేతలపై మహిళా అభ్యర్థులను పోటీకి దింపటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను ఓడించటమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు: 
మండపేట – తోట త్రిమూర్తులు- ఓసీ
రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాశ్- బీసీ
గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్- ఎస్సీ
కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి - ఓసీ
అమలాపురం – విశ్వరూప్ పినిపే - ఎస్సీ
ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ - బీసీ
రాజోలు – గొల్లపల్లి సూర్యారావు - ఎస్సీ
రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి - ఎస్టీ
కాకినాడ సిటీ – ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి - ఓసీ
పెద్దాపురం – దావులూరి దొరబాబు - ఓసీ
కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు - ఓసీ
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు - ఓసీ
పిఠాపురం – వంగా గీత - ఓసీ
జగ్గంపేట – తోట నరసింహం - ఓసీ
తుని – రామలింగేశ్వరరావు దాడిశెట్టి - ఓసీ
రాజమహేంద్రవరం సిటీ – మార్గాని భరత్
రాజానగరం – జక్కంపూడి రాజా - ఓసీ
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ - ఓసీ
అనపర్తి – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి - ఓసీ

Advertisment
తాజా కథనాలు