Vijayasai Reddy : టీడీపీ, జనసేన వాటా ఇంతే: విజయసాయి రెడ్డి టీడీపీ గెలుస్తుందనే నమ్మకం బీజేపీకి ఏ మాత్రం లేదన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని పేర్కొన్నారు. సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లను బీజేపీ టార్గెట్ పెట్టుకుందన్నారు. అందులో టీడీపీ,జనసేన వాటా సున్నా అంటూ ఎద్దేవా చేశారు. By Jyoshna Sappogula 17 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి YCP Vijayasai Reddy: టీడీపీపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయంలో బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉందని పేర్కొన్నారు. టీడీపీ మీద బీజేపీ నేతలు ఎటువంటి ఆశలు పెట్టుకోవడంలేదని చెప్పుకొచ్చారు. Also Read: రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ నాయకులు..! కనీసం ఒక్క స్థానంలోనైనా టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పినా బీజేపీ నమ్మదని స్థితిలో లేదన్నారు. టీడీపీ శక్తిసామర్థ్యాలు ఏ పాటివనే విషయం బీజేపీకి అర్థమైయిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తను సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. Even the BJP doesn’t believe that TDP can win any MP seats. The BJP has set a target of 370 seats for itself and 400 for the NDA alliance which means Shiv Sena (Shinde)+ NCP +JDU +RLD +LJP along with TDP & JSP are expected to win just 30 seats combined. TDP alliance will win 0… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 17, 2024 అదే విధంగా NDA కూటమి 400 చోట్ల విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుందన్నారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ, ఎన్సీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు 30 లోక్ సభ సీట్లు వస్తాయని కేంద్రంలోని బీజేపీ పెద్దల అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అయితే, ఇందులో టీడీపీ, జనసేనల వాటా మాత్రం సున్నా అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. #ycp-vijayasai-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి