Ongole Re Counting: వైసీపీ షాకింగ్ నిర్ణయం.. EVM మాక్ పోలింగ్ నుండి విత్‌డ్రా!

ఒంగోలులో ఈ రోజు చేపట్టిన EVM మాక్ పోలింగ్ నుంచి వైసీపీ విత్ డ్రా అయింది. తాము అడిగిన విధంగా వీవీప్యాట్‌ స్లిప్‌లతో సహా కౌంటింగ్‌ చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. అధికారులు మాత్రం ఈసీ గైడ్‌లైన్స్‌ ఆధారంగానే రీవెరిఫికేషన్‌ ఉంటుందని స్పష్టం చేశారు.

New Update
Guntur YCP: గుంటూరులో వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు

Ongole Re Counting: ఒంగోలులో ఓట్ల రీవెరిఫికేషన్‌కు బ్రేక్‌లు పడ్డాయి. EVM మాక్ పోలింగ్ నుండి వైసీపీ విత్‌డ్రా చేసుకుంది. తాము అడిగిన విధంగా వీవీప్యాట్‌ స్లిప్‌లతో సహా కౌంటింగ్‌ చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల గైడ్‌లైన్స్‌ ఆధారంగానే రీవెరిఫికేషన్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. మాక్‌ పోలింగ్‌ సైతం జరుగుతుందని చెప్పారు. వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కౌంటింగ్‌పై హైకోర్టులో బాలినేని పిటిషన్‌ దాఖలు చేశారు.

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. బాలినేని పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. నాట్‌ శాటిస్‌ఫైడ్‌ డిక్లరేషన్ ఇచ్చారు YCP తరపున న్యాయవాదులు. ప్రస్తుతానికి ఓట్ల రీవెరిఫికేషన్‌ను అధికారులు ఆపేశారు. YCP తరుఫున లీగల్‌ సెల్ లాయర్‌ లోకేశ్వర్‌ రెడ్డి, స్వామి రెడ్డి, రాములు హాజరయ్యారు.

Also Read : జగనన్నకు షర్మిల మరో షాక్.. రాఖీ సందర్భంగా సంచలన ట్వీట్!

Advertisment
తాజా కథనాలు