YCP shocking comments: చంద్రబాబుపై విరుచుకుపడిన వైసీపీ నేతలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై వైసీపీ(YCP) భగ్గుమంటోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తు తీవ్ర విమర్శలతో విరుచుకపడుతున్నారు వైసీపీ నేతలు. వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారు వైసీపీ మంత్రులు. టీడీపీ(TDP) రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం హేయమైన చర్య అంటూ అధికార పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

New Update
YCP shocking comments: చంద్రబాబుపై విరుచుకుపడిన వైసీపీ నేతలు..!

YCP Ministers shocking comments:టీడీపీ అధినేత చంద్రబాబు((Chandrababu Naidu)పై వైసీపీ పొలిటికల్ అటాక్‌ చేస్తోంది. చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రులు వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారు. టీడీపీ పార్టీ నేతలపై ధ్వజమెత్తుతున్నారు అధికార పార్టీ మంత్రులు.

ప్రతిపక్షనేత అన్న గౌరవంతోనే..

‘చంద్రబాబు పాపాల భైరవుడు.. యువతకు నైపుణ్యం పేరుతో కోట్లాది రుపాయలు దోచుకున్నారని మాజీ మంత్రి పేర్నినాని(perni nani) విమర్శించారు. చంద్రబాబు ఎన్నో స్కాంలు, ఎంతో అవినీతికి పాల్పడ్డారని.. అందుకే చట్ట ప్రకారమే అరెస్ట్‌ చేశారని అన్నారు. దర్యాప్తు జరిగే కొద్దీ అన్నీ పేర్లు బయటకొస్తాయన్నారు. చంద్రబాబు విషయంలో సీఐడీ అన్ని నిబంధనలూ పాటించిందని పేర్నినాని తెలిపారు. చంద్రబాబు ఎంత తిడుతున్నా సీఐడీ అధికారులు సంయమనం పాటించారన్నారు. అరెస్ట్‌ సమయంలో డీఐజీ స్థాయి వ్యక్తితో చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు.  ప్రతిపక్షనేత అన్న గౌరవంతోనే  కోర్టు కూడా ఇంటి భోజనం, ప్రత్యేక వసతులకు అనుమతి నిచ్చారని వ్యాఖ్యనించారు.

అరెస్ట్‌ చేయించాల్సిన అవసరం మాకేంటి?..

ఒక పొలిటీషియన్‌ అరెస్ట్‌ కావడం, జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్‌ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం ఏంటి? అనేది కూడా చూడాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి రాష్ట్రంలో ప్రతీఒక్కరికీ తెలుసని.. ఆధారాల్లేకుండా కోర్టులు తీర్పులు ఇవ్వవనే విషయం గుర్తించాలని అన్నారు.  ఫైబర్‌ నెట్‌, అసైన్డ్‌ భూములు, అమరావతి లాంటి  కుంభకోణాలు చంద్రబాబు చేశారని అంబటి ఆరోపించారు. రెండు రోజులు రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొందని.. చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పటి నుంచి రాజకీయ డ్రామాలాడాతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్‌ చేయించాల్సిన అవసరం మాకేంటి? అంటూ ప్రశ్నించారు.

అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది..

చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్‌ కింగ్‌ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయాడని విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అరెస్టు ఏ మాత్రం  కక్షసాధింపు చర్య కాదని అంటున్నారు వైసీపీ నేతలు. ఆయన్ను జైలుకు పంపి ఆనంద పడాల్సిన అవసరం ఎవరికీ లేదని వ్యాఖ్యనిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌.. రిమాండ్‌.. కక్ష పూరిత చర్య అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు.. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan),..లోకేష్(lokesh) లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు

Advertisment
తాజా కథనాలు