BIG BREAKING: వైసీపీ మూడో లిస్టు విడుదల.. వారికి టికెట్ కట్

వైసీపీ పార్టీ మూడో లిస్టుపై సస్పెన్స్ కు ఎండ్ కార్డు పడింది. వైసీపీ పార్టీ మూడో లిస్టును విడుదల చేసింది. 21 మందితో మూడో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి.

New Update
BIG BREAKING: వైసీపీ మూడో లిస్టు విడుదల.. వారికి టికెట్ కట్

YCP THIRD LIST: వైనాట్‌ 175 అంటూ అన్ని నియోజకవర్గాల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధినేత సీఎం జగన్‌ నియోజకవర్గాలకు సంబంధించిన పలువురు అభ్యర్థులను మార్చివేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లుగా మార్చివేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్టును 11 మంది, రెండవ లిస్టును 27 మందితో గతంలోనే విడుదల చేసింది. వీరిలో 13 మంది సిట్టింగ్‌లను మార్చగా.. 25 నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించారు. అయితే తాజాగా గురువారం నాడు 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. 6 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన పేర్లు ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీ సీట్లు..

* శ్రీకాకుళం పార్లమెంట్‌ - యారాడ తిలక్‌, విశాఖ ఎంపీ - బొత్స ఝాన్సీ
* ఏలూరు పార్లమెంట్‌ - కారుమూరి సునీల్‌ కుమార్‌
* విజయవాడ పార్లమెంట్‌ - కేశినేని నాని
* కర్నూలు పార్లమెంట్‌ - గుమ్మనూరి జయరామ్
* తిరుపతి పార్లమెంట్‌ - ఆదిమూలం (సత్యవేడు ఎమ్మెల్యే)

అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు..

* టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్‌
* చింతలపూడి - కంబం విజయ జయరాజ్
* రాయదుర్గం - మెట్టు గోవింద రెడ్డి
* దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
* పూతలపట్టు - ఎం.సునీల్‌
* చిత్తూరు - విజయేంద్ర రెడ్డి
* మదనపల్లి - నిస్సార అహ్మద్‌
* రాజంపేట -ఆకేపాటి అమర్‌నాధ్‌
* ఆలూరు - విరుపాక్షి
* కోడుమూరు - డాక్టర్‌ సతీష్‌
* గూడూరు - మెరుగు మురళి
* సత్యవేడు - గురుమూర్తి
* పెనమలూరు - జోగి రమేష్‌
* పెడన - ఉప్పల రాము

publive-image

Advertisment
తాజా కథనాలు