Beeda Masthan Rao: యాక్సిడెంట్ కేసు.. బెయిల్‌పై వైసీపీ ఎంపీ కూతురు విడుదల

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కారు ఎక్కించిన ఘటనలో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు మధురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన కాసేపటికే ఆమె స్టేషన్ బెయిల్ పై విడుదల అయింది. విషయం తెలుసుకున్నమృతుడి బంధువులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

New Update
Beeda Masthan Rao: యాక్సిడెంట్ కేసు.. బెయిల్‌పై వైసీపీ ఎంపీ కూతురు విడుదల

Beeda Masthan Rao:ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కారు ఎక్కించిన ఘటనలో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు మధురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన కాసేపటికే ఆమె స్టేషన్ బెయిల్ పై విడుదల అయింది. విషయం తెలుసుకున్నమృతుడి బంధువులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

అసలేం జరిగింది..

వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు అరెస్ట్‌ అయ్యారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో (Hit and Run Case) అరెస్ట్‌ చేసిన చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడిపైకి ఆమె కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడిపైకి కారు ఎక్కింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నై (Chennai) బెసంట్‌నగర్‌కు చెందిన పెయింటర్‌ సూర్య మృతి చెందాడు. చెన్నై బెసంట్‌నగర్‌ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురి కారు డ్రైవ్‌ చేసిందని పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో బీద మస్తాన్‌రావు కుమార్తెను అరెస్ట్‌ చేసి విచారించారు చెన్నై పోలీసులు. కాగా అరెస్టైన కాసేపటికే స్టేషన్ బెయిల్ పై ఆమె ను పోలీసులు విడుదల చేశారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు అమ్ముడు పోయారని నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Also Read: ఫుల్లుగా తాగి..కుక్కని తీసుకొచ్చి పిల్లి అంటూ ఆస్పత్రిలో రచ్చ చేసిన వ్యక్తి!

Advertisment
తాజా కథనాలు