ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. ట్విస్ట్ ఎంటంటే..!

వైసీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకున్నాడు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను వివాహం చేసుకున్నారు. విచిత్రం ఎంటంటే..ఈ మూడో పెళ్లికి రెండో భార్య సాక్షి సంతకం చేసింది. ఇదే కథలో అసలు ట్విస్ట్.

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. ట్విస్ట్ ఎంటంటే..!
New Update

YCP MLC Venkataramana: వైసీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకున్నాడు. కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను వివాహం చేసుకున్నారు. విచిత్రం ఎంటంటే ఈ మూడో పెళ్లికి రెండో భార్య సాక్షి సంతకం చేయడం అందిరినీ షాక్ కు గురిచేస్తోంది.

మూడో పెళ్లి చేసుకున్న సుజాత ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమెకు కూడా గతంలో పెళ్లి జరిగి ఓ కుమారుడు ఉన్నారు. ఆమెకు రెండో పెళ్లి కాగా వెంకటరమణకు మూడో పెళ్లి . కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా రెండో భార్యను ఒప్పించి ఎమ్మెల్సీ మూడో పెళ్లి చేసుకున్నారు. స్వయంగా రెండో భార్య సాక్షి సంతకం చేయడమే కథలో ట్విస్ట్ గా కనిపిస్తోంది. భార్య, కుమారుడు సమక్షంలోనే ఈ  పెళ్లి జరిగింది. కాగా, ఎమ్మెల్సీ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. అప్పటికి ఆమెకు ఓ కూతురు ఉంది. తర్వాత వెంకట రమణ రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి ద్వారా ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. తాజాగా, ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నారు.

publive-image

Also Read: యువగళం పాదయాత్ర కాదు.. బ్రేకుల యాత్ర..హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

జయ మంగళ వెంకట రమణ ఇటీవలి కాలం వరకూ టీడీపీలోనే ఉన్నారు. ఆయన కైకలూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు. జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన వెంటనే ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. ఎన్నికల్లో ఆయన నిలబడి.. ఉత్కంఠ పోరులో రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe