/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/thota-trimurthulu-.jpg)
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విషయంలో తమ అంచనాలు తప్పాయని వైసీపీ (YCP) ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) వ్యాఖ్యానించారు. ఈ రోజు ఎమ్మెల్సీలతో జగన్ (YS Jagan) నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీవీ (RTV) తో మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల వరకే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉంటుందని తాము అనుకున్నామన్నారు. కానీ పవన్ ఫ్యాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా కనపడిందన్నారు. కూటమి విజయానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని అన్నారు. చంద్రబాబు అంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కారకుడు పవనే అని అన్నారు. ల్యాండ్ టైలింగ్ యాక్ట్ బిల్లు మండలికి వస్తే మద్దతు ఇవ్వాలా? లేదా? అనేది బిల్లును చూసిన తర్వాత నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. త్రిమూర్తులు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Also Read : స్టాలిన్.. నవీన్ పట్నాయక్.. చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు