మాజీ మంత్రి శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి ..నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమాపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే ఉమా కంటే జనసేన పార్టీ అక్కల గాంధీనే బలమైన ప్రత్యర్థిగా చూస్తున్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 22 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. శవాల మీద పేలాలు వేరుకునే వెదవ అంటూ ధ్వజమెత్తారు. మైలవరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు నేపద్యంలో మాజీ మంత్రి ఉమా కంటే జనసేన పార్టీ అక్కల గాంధీ నే తమకు బలమైన ప్రత్యర్థి అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అక్కల గాంధీ నిబద్దత కలిగిన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ లో ఇద్దరం కలిసి పనిచేశామని తెలిపిన వసంత కృష్ణప్రసాద్ ..ఉమా మాటలు విని మీరు అతని లాగా రాజకీయాలు చెయోద్దని జనసేన నేత అక్కల గాంధీకు సూచించారు. మన మద్య ఉన్న రాజకీయ విభేదాలను ఉమా లాగా మాట్లాడి వ్యక్తిగతంగా మార్చవద్దని అన్నారు. Also Read: ధర్నా చౌక్ వద్ద కర్ణాటక రైతుల ఆందోళన.! మాజీ మంత్రి దేవినేని ఉమా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ తీవ్రంగా రెచ్చిపోయారు వైసీపీ ఎమ్మెల్యే. శవాల మీద పేలాలు ఏరుకునే ఉమా వారి నేపద్యం అవసరం లేకుండానే ఏటి వద్ద ధర్నా చేసి వారి చావులకు నేనే బాద్యుడను అంటూ అసభ్యంగా ఆరోపణలు చేశారని అన్నారు. వీటీపీఎస్ బూడిద విషయంలో కూడా నాపైన బురద జల్లుతున్నారు.. ఐ డోంట్ కేర్ అంటూ తేల్చి చెప్పారు. నువ్వు రాజకీయాలు మాట్లాడితే, నేను రాజకీయాలు మాట్లాడతా..నువ్వు కుటుంబం గురించి మాట్లాడితే నేను మాట్లాడతా అని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కి తెలుగుదేశం పార్టీలో ఏస్థాయి లేదని దుయ్యబట్టారు. ఉమా కంటే జనసేన పార్టీ అక్కల గాంధీ నే నేను బలమైన ప్రత్యర్థిగా చూస్తానని తెలిపారు. అక్కల గాంధీ కి ఒకటే చెప్తున్నా మీ పని మీరు చేసుకోండి, ఉమా మాటలు విని మీరు అతిగా మాట్లాడితే మీ సంస్కారాన్ని కోల్పోతారని హెచ్చరించారు. #tdp-devineni-uma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి