ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆందోళన

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని నిరసన చేపట్టారు. అనంతరం వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు లేఖ రాశారు.

New Update
ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆందోళన

kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే. అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. మద్యాహ్నం అవుతున్నా రిజిస్ట్రేషన్ సిబ్బంది విధులకు హజరు కాకపోవడంతో ఆందోళనకు దిగారు. మహమ్మద్ రఫీ అనే ఇంచార్జ్.. డిప్యూటీ సీఎం సన్నిహితుడని చెప్పుకుంటూ.. విధులకు సరిగా హాజరు కాకుండా..భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ రఫీని వెంటనే సస్పెండ్ చేయాలని పై అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్  కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Also Read: వాలంటీర్ తో కలిసి కిలాడి లేడి స్కెచ్..యువకుడిని కిడ్నాప్.!

ఈ క్రమంలో టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అక్రమంగా 2వేల 500 కోట్లు సంపాదించానని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ధి పనుల విషయంలో విమర్శించలేకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులంతా కలిసి సామూహికంగా ఆస్తుల ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలకు బహిరంగంగా సవాల్ విసిరారు. తనకు 2 వేల 350 కోట్ల ఆస్తి ఉన్నట్టు నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు.

Also read: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు