Srikakulam : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పారంపేట గ్రామంలో వైసీపీ(YCP), టీడీపీ(TDP) కార్యర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త సత్తిబాబు(Satti Babu) పై టీడీపీ కార్యకర్త గణేష్ కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సత్తిబాబు తలకు తీవ్రగాయాలు అవ్వడంతో వెంటనే అతడిని రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
Also Read: మంత్రి బుగ్గన నామినేషన్ ను రద్దు చేయాల్సిందే..
ఆస్పత్రిలో సత్తిబాబును ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్, ఎమ్మెల్సీ విక్రాంత్ పరామర్శించారు. అనంతరం రాజేష్ మాట్లాడుతూ.. వైసీపీ నామినేషన్ కోసం సత్తిబాబు ఎక్కువ మంది కార్యకర్తలను తీసుకువెళ్లాడనే టీడీపీ కార్యకర్త గణేష్ దాడి చేశాడని ఆరోపించారు. కార్యకర్తలు జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భౌతిక దాడులకు పాల్పడే సంస్కృతి సరైనది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.