ఈ క్రమంలో టీడీపీ నారా లోకేష్(lokesh) తోపాటు తెలుగు దేశం పార్టీ శ్రేణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ ఆందోళనలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని సజ్జల అన్నారు. టీడీపీ నేతలు అసలు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. స్కామ్ పై అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? అని సజ్జల ప్రశ్నించారు. అంతే కాకుండా, లోకేష్ అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఢిల్లీలో ఏం చేస్తున్నారంటూ? ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారని.. ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, టీడీపీని నడిపే బాధ్యత కూడా ప్రజలదేనని ఆ పార్టీ లీడర్స్ అనడం సిగ్గుచేటని సజ్జల విమర్శించారు.
ఇన్నర్ రింగ్ ప్రాజెక్టులోనూ చంద్రబాబు అక్రమాలు చేశారని సజ్జల ఆరోపించారు. అన్ని కుంభకోణాల్లోనూ కిలారు రాజేశ్‌ది కీలకపాత్ర అని తెలిపారు. అమరావతి భూముల స్కామ్ లోనూ చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. అసైన్డ్ భూములు లాక్కొని పేదల కడుపుకొట్టారిని మండిపడ్డారు. వీటన్నింటికి చంద్రబాబే సూత్రధారని.. మిగతా వాళ్లు సహకరించారని సజ్జల ఆరోపించారు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని టీడీపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు సజ్జల.