/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/r-1-2-jpg.webp)
Roja:రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది మంత్రి రోజా. చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసంలో వినాయక చవితి పూజ నిర్వహించారు మంత్రి రోజా. అందరి కుటుంబాల్లో సమస్యలు తొలిగిపోయి అందరు సంతోషంగా ఉండాలని వినాయకుడిని ప్రార్ధించినట్లు వెల్లడించింది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలంటూ వ్యాఖ్యనించింది. సీఎం జగన్ మళ్లీ వచ్చే వినాయక చవితికి రెండో సారి ముఖ్యమంత్రి అవ్వాలని..దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ని నెం.1 గా తీర్చిదిద్దాలని వినాయకుడిని కోరుకున్నట్లు పెర్కొంది. సీఎం జగన్ కు బలాన్ని, ఆలోచన శక్తిని, విజయాన్ని ప్రసాధించాలని ఆ వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపింది.
వినాయక చవితి పండగను కొన్ని ప్రాంతాల్లో 9రోజులు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. పూలు, పండ్లు, నైవేద్యము నీళ్లు ఇలా 16దశల్లో గణేశుడిని పూజిస్తారు. గణేష్ నవరాత్రుల సమయంలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. అది కూడా సాత్వికాహారాన్ని తింటారు.గణేష్ నిమజ్జనం కోసం సాగే శోభాయాత్ర తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వేడుకలకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
Also Read: పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా.. చూస్తే వావ్ అనాల్సిందే..